అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

కాబూల్‌కు చేరుకున్న తాలిబన్లు.. దేశం విడిచివెళ్లిన అఫ్గాన్‌ అధ్యక్షుడు..!!

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌కు తాలిబన్లు చేరుకోవడంతో దేశం మొత్తం వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్‌ ఘనీ ముఖ్య అనుచరులతో దేశం విడిచి తజికిస్తాన్‌కు వెళ్లిన అష్రఫ్‌, అక్కడ నుంచి వేరే దేశానికి వెళ్లనున్నట్లు సమాచారం! అన్ని వైపుల నుంచి తాలిబన్లు కాబూల్‌ను చుట్టుముట్టినట్లు అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి పేర్కొనగా అఫ్గాన్‌ సైన్యం, తాలిబన్లకు మధ్య కాల్పులు జరిగాయా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ పదవి నుంచి తప్పుకొని దేశం విడిచి వెళ్లనున్నారని రెండు రోజుల ముందునుంచే వార్తలు వస్తుండగా దేశప్రజలనుద్దేశిస్తూ ఆయన ఒక విడుదల చేసారు. దానిలో అఫ్గాన్‌ ప్రజలపై యుద్ధం ప్రకటించడాన్ని అంగీకరించనన్న ఆయన, రెండు దశాబ్దాలుగా సాధించిన లక్ష్యాలను కోల్పోవడానికి సిద్ధంగా లేనని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్నీ సహించనని అష్రఫ్‌ ఘనీ స్పష్టం చేశారు. కానీ, విస్తృత వేగంతో తాలిబన్లు కాబూల్‌ను చేరుకోవడంతో తప్పని పరిస్థితుల్లో అధికారాన్ని వదిలి.. దేశాన్ని విడిచిపోయేందుకు అష్రఫ్‌ ఘనీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •