జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ మార్కులు..??

దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తోన్న జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలైన సంగతి పాఠకులకు విదితమే! అయితే తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు షెడ్యూల్‌, కటాఫ్‌ మార్కులను జాతీయ పరీక్షల మండలి (NTA) విడుదల చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 20వ తేదీ సాయంత్రం వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తునకు అవకాశం ఉంటుందని తెలిపింది. అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫీజు మాత్రం 21వ తేదీలోపు చెల్లించవచ్చని పేర్కొంది. అక్టోబర్‌ 3న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఇందుకు దరఖాస్తు చేసుకునే వివిధ కేటగిరీ వారికి కటాఫ్‌ మార్కులను (శాతాల్లో) ఎన్‌టీఏ విడుదల చేసింది.

కేటగిరీ కటాఫ్‌ శాతం:

ఓపెన్‌ కేటగిరీ (UR) 87.89 శాతం
ఓబీసీ (OBC) 68.02శాతం
ఈడబ్ల్యూఎస్‌ (EWS) 66.22శాతం
ఎస్సీ (SC) 46.88శాతం
ఎస్టీ (ST) 34.67శాతం

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    12
    Shares
  • 12
  •  
  •  
  •  
  •