అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

నలుగురు డీఆర్‌డీఓ కాంట్రాక్టు ఉద్యోగుల అరెస్టు.. ఎందుకంటే??

పాకిస్తాన్‌ ఏజెంట్లకు రహస్య సమాచారం అందిస్తున్న నలుగురు డీఆర్‌డీఓ కాంట్రాక్టు ఉద్యోగులుగా బాలాసోర్‌జిల్లా డీఆర్‌డీఓ ఇంటిగ్రేటెడ్‌ రేంజ్‌లో పనిచేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత వీరిని ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్రన్‌ రేంజ్‌ ఐజీ హిమాంన్షు కుమర్‌ చెప్పారు. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందన్నారు.

కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరికి పలు ఐఎస్‌డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందడంతో నలుగురు డీఎస్‌పీలతో పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించగా వీరు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు.

అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని, వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని వీరిపై చాందీపూర్‌ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై డీఆర్‌డీఓ ఇంకా స్పందించలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •