ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

హైదరాబాద్ లో గుండెమార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం!!

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి గుండెను మలక్‌పేట యశోద ఆసుపత్రి నుంచి ఇవాళ మధ్యాహ్నం గ్రీన్‌ ఛానల్‌ ద్వారా పంజాగుట్ట నిమ్స్‌ కు తరలించి ఇవాళ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. మధ్యాహ్నం 2.15గంటలకు నిమ్స్‌లో ప్రారంభమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స రాత్రి 7గంటలకు దాదాపు 5గంటల పాటు గుండె మార్పిడి చికిత్స జరిగింది. ప్రస్తుతం గుండె అమర్చిన పెయింటర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు వైద్యులు తెలిపారు. గతంలోనూ ఇక్కడ పలుమార్లు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. కాగా, బయటి నుంచి నిమ్స్‌కు గుండెను తీసుకురావడం ఇదే తొలిసారి. గుండె కోసం పెయింటర్‌ అయిన రోగి జీవన్‌దాన్‌లో నిన్న నమోదు చేసుకోగా ఇంత త్వరగా రోగికి గుండె దొరకడం అరుదైన ఘటనగా వైద్యులు వర్ణించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •