అంతర్జాతీయం (International) వార్తలు (News)

కువైట్ లో ఇకపై జైల్ ఫ్రమ్ హోమ్??

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అన్నీ అల్లాడిపోవడమే కాకుండా ఎన్నో వ్యాపారాలు, సంస్థలు, దివాలా తీయడమే కాకుండా సాఫ్ట్ వేర్ కంపెనీలు అయితే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించగా దాదాపు అన్ని సంస్థలు అదే దారిలో ఉద్యోగులకు అవకాశాలు ఇచ్చాయి.

చివరికి విద్యార్ధులకు ఇంటి నుంచే క్లాసులు వినేలా వర్చువల్ విధానం ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ కువైట్ ఒకడుగు ముందుకు వేసి తమ జైళ్ళలో ఖైదీలకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి సౌకర్యం కల్పించింది. కువైట్ ప్రభుత్వం తాజాగా జైలు ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ను అమలులోకి తీసుకువచ్చింది. ఉద్యోగులు, విద్యార్ధులు, ఇళ్ళలో ఉండి హాయిగా పనులు చేస్తున్నప్పుడు దొంగలు ఎందుకు జైళ్లలో మగ్గిపోవాలి అనుకుందో ఏమో కానీ జైలు ఫ్రమ్ హోమ్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం దొంతతనం చేసే ఏదన్నా తప్పు చేసి జైలు శిక్ష పడిన వారు ఇకపై హాయిగా ఇంట్లో ఉండే శిక్షను అనుభవించవచ్చునని తెలిపింది. కువైట్ ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలు అన్ని ఒక్క సారిగా దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

కానీ జైలు శిక్ష పడిన ప్రతీ ఒక్కరికీ ఈ జైలు ఫ్రమ్ హోమ్ వర్తించదు. కేవలం 3 ఏళ్ళ కంటే తక్కువ జైలు శిక్ష పడిన ఖైదీలకు మాత్రమే ఈ జైలు ఫ్రమ్ హోమ్ వర్తిస్తుంది. జైలు ఫ్రమ్ హోమ్ లో ఉండే ఖైదీల కాళ్ళకు ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ ఏర్పాటు చేసి వారు ఇంట్లో ఉన్నారా లేరా ఉంటె ఎంత సమయం జైలు జీవితం గడుపుతున్నారు అనే విషయాలు లెక్కిస్తారు. ఈ విధానం ప్రతిపాదనకు వచ్చిన తరువాత అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని ప్రకటించింది ప్రభుత్వం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •