దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12,16,011 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 7,974 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 343 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,76,478 కి చేరింది. గత 24 గంటల్లో 7,948 మంది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.41 కోట్లకు చేరింది. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 87,245కి చేరింది.