ఏపీ సర్కార్ రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు మార్గాలు వెతుకుతుండగా వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఇప్పుడు జగన్ సర్కార్ కు విద్యుత్ చార్జీలు గుర్తు రావడంతో అనుకున్నదే తడవుగా మార్గదర్శాలను రూపొందిస్తోంది.

ఏపీ ప్రజలపై 3685 కోట్లు అదనపు భారం పడే అవకాశం కనిపిస్తుంది. విద్యుత్ చార్జీలు విధించే వివిధ స్లాబుల్లో మార్పులు చేయనుంది. 30 యూనిట్ల వరకూ విద్యుత్ ను వినియోగించిన వారికి 1.45 పైసలు అదనంగా చార్జీలు విధించనుంది.

31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకూ వాడితే 2.80 పైసలు, 100 యూనిట్ల వరకూ వాడితే అదనంగా నాలుగు రూపాయలు, 101 నుంచి 200 యూనిట్ల వరకు ఐదు రూపాయలు, 201 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు వాడితే 7.50 పైసలు భారం పడుతుంది. కానీ పెరిగిన ధరలను ఎప్పటి నుంచి వసూలు చేస్తారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ ఈ నెల చివరన ప్రకటించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.