ఏపీలో జరిగిన ఎపీఎస్ ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదం ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సకాలంలో సరైన వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

ఏపీఎస్ ఆర్టీసీ బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోగా ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చిన్నా రావు సహా 9 మంది చనిపోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు నీళ్లలో పడటంతో అందులోంచి బయటకు రావడానికి వీల్లేక, ఊపిరి ఆడకే ఆ తొమ్మిది మంది ప్రాణాలు విడిచారని ప్రత్యక్ష సాక్షుల కధనం.