తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు అధికారులు బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆలస్యం చేయకుండా ఫలితాలను ఇవాళ విడుదల చేయాలని మంత్రి బోర్డు అధికారులకు తెలిపారని సమాచారం.

మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించబడ్డాయి. అభ్యర్థులు తమ ఫలితాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.