ముంబయి ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో హెడ్‌(లార్జ్‌ కార్పొరేట్‌ రిలేషన్‌షిప్స్‌)-01, బిజినెస్‌ హెడ్‌ (కమర్షియల్‌ వెహికల్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మైనింగ్‌ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌)-01, బిజినెస్‌ హెడ్‌(లోన్‌ అగైనెస్ట్‌ ప్రాపర్టీ అండ్‌ అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌)-01, వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ)-04 పోస్టులు ఉన్నాయి.

హెడ్, బిజినెస్‌ హెడ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 36 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌ లిస్టింగ్ చేస్తారు. అనంతరం పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిచేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 23-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.