వరుస నష్టాలకు ఎట్టకేలకు నేడు బ్రేక్‌ పడింది. గత నాలుగు రోజులుగా వరుస నష్టాలకు గురైన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కాస్త కోలుకున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 58,243 పాయింట్ల వద్ద మొదలైన ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడి, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని చివరకు 113 పాయింట్ల స్వల్ప లాభంతో 57,901 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 27 పాయింట్ల లాభంతో 17,248 వద్ద ముగిసింది.

ఎన్ఎస్‌ఈలో బీపీసీఎల్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌ కంపెనీ, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో ముగిసాయి. సిప్లా, హీరో మోటార్స్‌, మారుతి సుజుకీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.