పన్నెండో తరగతి అకౌంటన్సీ టర్మ్‌-1 ప్రశ్నపత్రంలో ఒక పొరపాటు చోటు చేసుకోవడంతో ఆ ప్రశ్నకు విద్యార్థులకు 6 గ్రేస్‌ మార్కులు ఇవ్వనున్నట్లు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు అసత్యమని సీబీఎస్‌ఈ వెల్లడించింది. 28 నుంచి 31 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారికి 38 మార్కులు ఇవ్వనున్నట్లు ఆ సందేశంలో వినిపిస్తోంది. అది నిజం కాదని సీబీఎస్‌ఈ పేర్కొంది. విద్యార్థులు అలాంటివాటిని నమ్మవద్దని సీబీఎస్‌ఈ సూచించింది.