దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 58,232 వద్ద ట్రేడవుతుండగా, ఇక నిఫ్టీ 128 పాయింట్లు ఎగబాకి 17,349 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రైడెంట్, హెగ్ లిమిటెడ్, మైండ్ ఇండస్ట్రీస్, నిర్లాన్, ఆల్కార్గో లాజిస్టిక్స్ సంస్థల షేర్లు లాభాల్లో ప్రయాణిస్తుండగా టీవీఎస్ మోటార్స్, రత్నమణి మెటల్స్, టొరెంట్ పవర్, ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.