దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 13,13,444 లక్షల పరీక్షలు నిర్వహిస్తే 2,58,089 కొత్త కేసులు నిర్ధారణయ్యాయి. నిన్న ఒక్కరోజు 358 మంది కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,51,740 మంది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి ఎంతొట్టం సంఖ్య 3,53,37,461కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,56,341 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8,209కు చేరింది.