ప్రతిష్టాత్మక బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణుల ఎగుమతికి సంబంధించి తొలి ఆర్డర్‌ 2,780 కోట్ల కాంట్రాక్ట్‌ను ఫిలిప్పీన్స్‌ ఇచ్చిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌కు క్షిపణులతోపాటు మూడు బ్యాటరీలు, క్షిపణుల నిల్వ, వాటిని ఎలా ప్రయోగించాలనే అంశాలపై ఫిలిప్పీన్స్‌ సైనిక సిబ్బందికి శిక్షణ, తదితర వివరాలను ఈ ఒప్పందంలో పొందుపరిచారు. ఒప్పందంలో భాగంగా యాంటీ-షిప్‌ వేరియంట్‌ క్షిపణులను సరఫరా చేయాలి.