ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ వ్యాపారసంస్థ అమెజాన్ కు,భారతదేశంలోనే అతిపెద్ద
కంపెనీ రిలయన్స్ సంస్థ మధ్య గొడవకు అనేక కారణాలు ఉన్నాయి.దానిలో ముఖ్యంగా భారత దేశానికి చెందిన రిటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ తో ఈ రెండు కంపెనీ లు వేర్వేరుగా ఒప్పందాలు చేసుకోవడమే ఈ వివాదానికి మూలం.

ఫ్యూచర్ గ్రూప్ 340 కోట్ల డాలర్ల విలువైన రిటైల్ ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్ కు విక్రయించడానికి ఈ ఏడాది ఆరంభంలోనే ఒప్పందం చేసుకుంది.
అయితే 2019 నుండే ఫ్యూచర్ కూపన్స్ లో అమెజాన్ సంస్థకు 49 శాతం వాటా ఉంది.ఈ కారణం గా ఫ్యూచర్ రిటైల్ సంస్థ మీద అమెజాన్ కు పరోక్షంగా యాజమాన్య వాటా లభించే అవకాశం ఉంది.అందుకే ఫ్యూచర్ గ్రూప్ తన వాటాను రిలయన్స్ తో కలిపి కొన్ని భారతీయ సంస్థలకు విక్రయించడానికి అంగీకరించనని అమెజాన్ వాదిస్తుంది.ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల రిటైల్ దుకాణాల చైన్ వ్యాపారమైన ఫ్యూచర్ రిటైల్ సంస్థ తీవ్రంగా దెబ్బ తిన్నది.అందువల్ల కంపెనీని నష్టాలనుండి కాపాడడానికి రిలయన్స్ సంస్థతో ఒప్పందం అవసరమని ఆ సంస్థ వాదిస్తుంది.
ఈ వివాదంలో కోర్ట్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ కు అనుకూలం గా రిలయన్స్ సంస్థకు విక్రయం చెల్లుతుందని తీర్పు ఇచ్చింది.

రిలయన్స్ సంస్థ రిటైల్ విభాగానికి దేశవ్యాప్తంగా 420 కి పైగా నగరాలలో 1 ,800 కు పైగా రిటైల్ స్టోర్ లు ఆ సంస్థకు అందుబాటులోకి వస్తాయి.”రిలయన్స్ సంస్థకు డబ్బు ఉంది,ఆ సంస్థ ప్రభావం ప్రజల మీద ఉంది.మార్కెట్ లో ఇలాంటివన్నీ చాల అత్యవసరం.అయితే ఈ-కామర్స్ వ్యాపారంలో వారికి విశిష్ట నైపుణ్యం లేదని”అంటారు.
అమెజాన్ సఫలమైతే….ఈ-కామర్స్ రంగంలో తన పోటీదారు ప్రణాళికలను నెమ్మదింపచేస్తూ తాను గెలిచే అవకాశం ఉంది.