బెంగుళూరు లో ఒకేసారి ఒక అపార్ట్మెంట్ లో 103 మంది ఒకేసారి కరోనా బారిన పడ్డారు.బొమ్మనహళ్లి జోన్ లో బిలేకహళ్లి లో ఉన్న అపార్ట్మెంట్ లో 435 ప్లాట్ లు ఉన్నాయి.ఆ ప్లాట్ లో మొత్తం 1500 మంది నివసిస్తున్నారు.ఈ నెల 6 వ తేదీన ఈ అపార్ట్మెంట్ వాసులు అందరు ఒక పెద్ద పార్టీ చేసుకోగా, దానిలో పని చేయడానికి పనిమనుషులు, వంటివారు,డ్రైవర్ లు అందరు పలు పంచుకున్నారు.ఈ నెల 10 న మొదటి పాజిటివ్ కేసు బయటపడింది.అప్పుడు మొత్తం ఆరా తీయగా పాజిటివ్ కేసు ల సంఖ్యా 103 కి చేరింది.వీరిలో 60 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువ మంది ఉండడం గమనార్హం.
ఈ సమాచారం తెలుసుకున్న బెంగుళూరు మహానగర పాలిక అధికారులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని సెక్రటరీ, ఇతర సిబ్బందితో మాట్లాడి వారు పాటిస్తున్న కోవిద్ నిబంధనల ఫై ఆరా తీశారు.అందరు నిబంధనలన్నీ ఖశ్చితంగా పాటిస్తూ జీవనం సాగించాలని చెప్పారు.అపార్ట్మెంట్ మొత్తం శానిటైజ్ చేసారు.కరోనా బారినపడిన వారందరు ప్రస్తుతం క్వారంటైన్ కు వెళ్లారు.