సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచిన చిత్రం మురారి.ఈ సినిమా నేటితో 20 వసంతాలు పూర్తి చేసుకుంది.ఆ సందర్భం గా ఆ చిత్ర విశేషాలు..ఈ సినిమాని డైరెక్టర్ కృష్ణ వంశీ గారు తెరకెక్కించగా కథానాయకుడుగా మహేష్ బాబు,కథానాయిక గా సోనాలి బింద్రే నటించారు.లక్ష్మి,సుకుమారి,కైకాల సత్యనారాయణ,గొల్లపూడి,అన్నపూర్ణ,హేమ,సుధా,రఘుబాబు,రవిబాబు,ధూళిపాళ గార్లు ముఖ్య పాత్రల్లో నటించారు.ధూళిపాళ గారు నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం.అతిథి పాత్రల్లో ప్రకాష్ రాజ్,అచ్యుత్,ఎం ఎస్ నారాయణ,నాగబాబు మెరిశారు.
మణిశర్మ గారు ఈ చిత్రానికి సంగీతానిని స్వరపరచారు.ఇప్పటికి కూడా మురారి చిత్రంలోని పాటలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి.మరీ ముఖ్యం గా అలనాటి రామచంద్రుడి కన్నింటాసాటి అన్నగీతం ప్రతి పెళ్లి వేడుకల్లోనూ వినిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు.

2001 ఫిబ్రవరి 17 న విడుదలైన ఈ చిత్రం ఆ సంవత్సరానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా,ఉత్తమ సహాయ నటిగా లక్ష్మి గారికి,స్పెషల్ జ్యూరీ విభాగం లో మహేష్ బాబు గారికి నంది పురష్కారాల్ని తెచ్చిపెట్టింది.ఈ చిత్రాన్ని ఎం.రామలింగేశ్వర రావు గారి సారధ్యం లో రాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ ఫై నందిగం దేవిశ్రీప్రసాద్ గారు నిర్మించారు.ఇలాంటి చిత్రాలు ఇక మీద కూడా రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము.