రావులపాలెం మండలం లో ఈ నెల 21 వ తేదీన పంచాయత్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో మంగళవారం అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ ఇక్కడ ఏర్పాట్లు అన్ని జాగ్రత్తగా పరిశీలించారు. రావులపాలెం గవర్నమెంట్ కాలేజీ లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణి కేంద్రాన్ని ఇంకా స్థానిక జెడ్ పి బాలుర హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.వివరాలు అన్ని ఎంపిడిఓ రాజేంద్ర ప్రసాద్ మరియు యూసఫ్ జిలానీ లను అడిగి తెలుసుకున్నారు.