పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన బీహార్ కు చెందిన ప్రిన్సిపాల్ కు పాట్నా లోని పోక్సో కోర్ట్ మరణ శిక్షతో పాటు రూ. 100 000 జరిమానా ,ఆ ఘటనలో సహకరించిన టీచర్ కు జీవిత ఖైదు, రూ. 50 , 000 జరిమానా విధించింది.ఈ కేసు 2018 వ సంవత్సరం లో నమోదు అయినది.
స్కూల్ చివరి గంట కొట్టిన తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నా చిన్నారిని ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ తన గదికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు.అతనికి అభిషేక్ అనే టీచర్ కూడా సహకరించాడు.
కొంతకాలానికి కడుపు నొప్పి తో బాధపడుతున్న చిన్నారిని ఆమె తల్లితండ్రులు ఆస్పత్రిలో చూపించగా ఆ చిన్నారి గర్భవతిగా నిర్దారణ అయింది.చిన్నారిని పూర్తి వివరాలు అడగగా ఆమె చెప్పిన వివరాల ప్రకారం ప్రిన్సిపాల్ మీదా,అతనికి సహకరించిన అభిషేక్ అనే టీచర్ మీదా ఫిర్యాదు చేసారు.
తదుపరి పరీక్షలు జరపగా ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం నేరం నిరూపణ కావడం తో పోక్సో చట్టం కింద శిక్ష విధించింది.ఇది ఒక అరుదయిన కేసు అని ఈ కేసు ను విచారించిన న్యాయమూర్తి పేర్కొన్నారు.