భారత్ లో అహ్మదాబాద్ వేదికగా భారత్ * ఇంగ్లాండ్ డే/నైట్ టెస్ట్ సిరీస్ టిక్కెట్లు అన్ని అమ్ముడయ్యాయని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఐ పి ఎల్ పై కూడా అతి త్వరలో ప్రేక్షకుల అనుమతి మీద నిర్ణయం తీసుకుంటామని, స్వదేశంలో జరిగే ప్రతి టెస్ట్ సిరీస్లో ఒక డే/నైట్ మ్యాచ్ ని తప్పకుండ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
‘అహ్మదాబాద్ టెస్ట్ టికెట్ లు అన్ని అమ్ముడయ్యాయి.ఇది ఏంటో సంతోషించవలసిన విషయం గ పరిగణించాలని అన్నారు.
అహ్మదాబాద్ లో 6 – 7 ఏళ్ళ తర్వాత తిరిగి క్రికెట్ జరగనుంది అని, జై షా గారు టెస్ట్ మ్యాచ్ లన్ని ఎంతో శ్రద్దగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.అక్కడ కొత్త స్టేడియం నిర్మించారు.ఈ ఏడాది స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోవాలని, ఈ సంవత్సరం క్రికెట్ ఎంతో ఉత్కంఠభరితం గా ఉండబోతోందని చెప్పారు.
అలాగే ఐపిఎల్ కు ప్రేక్షకులని తీసుకురాలని ప్రయత్నిస్తున్నామని , దీని మీద అతి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నామని,ఇది మరో విజయవంతమైన టోర్నీ గా నిలవబోతోందని వెల్లడించారు.ఇక ఐపిఎల్ వేలం విషయానికి వస్తే ఇది మెగా వేలం కాదని,కానీ చాల చోట్ల జట్లు ఆటగాళ్లను తీసుకునేలా ప్రయత్నిస్తున్నాయని అన్నారు.ముఖాయంగా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వేలం లో చురుకుగా పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు.
మన స్వదేశం లో జరిగే ప్రతి టెస్ట్ సిరీస్ లో ఒక డే/నైట్ మ్యాచ్ ను తప్పక నిర్వహిస్తాం.ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో పింక్ బాల్ ప్రధాన మార్పు.టెస్ట్ క్రికెట్ని కాపాడుకోవలసిందిగా దాదా పేర్కొన్నారు.ఈమధ్యలో ఆంజియోప్లాస్టీ చేయించుకున్న గంగూలీ తను ఎంతో ఆరోగ్యం గా,ఫిట్ గా ఉన్నానని ,ఊహించినంత ప్రమాదం జరగలేదని తెలిపారు.