కరోనా వచ్చిన నాటినుండి దాని ధాటికి వణికిపోయిన ముంబై లో వైరస్ వ్యాప్తి కట్టడికి బిఎం సి అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు.ముంబై లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సంగతి ప్రేక్షకులకి విదితమే!ఈ పరిస్థితిని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తూ, కోవిద్ నిబంధనలు పాటించాలని ముంబై అధికారులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యం లో బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వారికీ భారీగా జరిమానా కూడా విధిస్తున్నారు.అందులో భాగంగా మాస్క్ లు ధరించని 15 లక్షల మంది పై చర్యలు తీసుకుని వారి నుండి దాదాపు రూ.30 కోట్ల ను వసూలు చేసారు.కేవలం సోమవారం ఒక్కరోజే 13 వేల మందికి జరిమానా విధించగా,వీరి నుండి 26 లక్షలు వసూలు చేసారు.ఇలా గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15 ,2021 మధ్య కాలంలో మాస్క్ ధరించని 15 లక్షల మందికి జరిమానా విధించి, వీరి నుండి రూ.30 కోట్ల ను వసూలు చేశామని వెల్లడించారు.ముంబై లో జుహూ, అంధేరి, వెర్సోవా లాంటి ప్రాంతాల్లోనే కోవిద్ నిబంధనలు పాటించనివారు ఎక్కువ ఉన్నారు.