జీవీఎంసీ కమిషనర్ గుమ్మళ్ల సృజన (2018 బ్యాచ్)ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి బదిలీ చేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ అయి సాధా రణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. విశాఖపట్నంలోనే ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా పనిచేస్తున్న నాగలక్ష్మి సెల్వరాజన్ (2012 బ్యాచ్)ను జీవీఎంసీ కమిషనర్ గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు

రెండు రోజుల క్రితమే సెలవులకు వెళ్లిన సృజన, జీవీఎంసీ ఎన్నికలు ప్రకటి స్తున్న తరుణంలో స్పజన నెల రోజులు సెలవు కావాలని కోరడం, వెంటనే ప్రభుత్వం ఆమోదించడం అనేక అనుమా నాలకు తావిచ్చింది. ఆమె స్థానంలో వీఎంఆర్‌డిఏ కమిషనర్ కోటేశ్వరరావుకు ప్రభుత్వం ఇన్దార్జి బాధ్యతలు అప్పగిం చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం విశాఖపట్నం కమిషనర్ గా నాగలక్ష్మిని ఎంపిక చేసి, ఆమెను నియమించా లని సూచించింది. దాంతో ప్రభుత్వం మంగళవారం ఉత్తరులు జారీచేసింది.