హైకోర్ట్ న్యాయవాది దంపతులు తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో హత్యకు గురి అయ్యారు.వారిపై దుండగులు కొందరు విచక్షణ రహితం గా దాడిచేసి హతమార్చారు.వామనరావు గారు, ఆయన సతీమణి నాగమణి మంథని గార్లు కోర్ట్ లో పని ముగించుకుని హైదరాబాద్ వెళ్తుండగా రామగిరి లోని కల్వచర్ల పెట్రోల్ బంక్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి వారిమీద కత్తులతో విచక్షణ రహితం గా దాడికి పాల్పడగా 108 వాహనం లో వీరిని ఆస్పత్రికి తరలిస్తున్న సమయం లో ఇద్దరూ మృతి చెందారు. ఆ సమయం లో వారితో ఉన్న న్యాయవాది కార్ డ్రైవర్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మరొకవైపు చెక్ పోస్ట్ ల వద్ద ముమ్మరంగా తనిఖీ లు నిర్వహిస్తూ పోలీస్ లు దుండగుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.