తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్‌ సారథ్యంలో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.