గత మూడు రోజులుగా భారత్ లో మళ్ళీ కరోనా కేసు లు పెరుగుతున్న నేపధ్యం లో మళ్ళీ లాక్ డౌన్ పెట్టబోతున్నట్టుగా ముంబై పాలకులు సంకేతాలు ఇస్తున్నారు.ప్రజలు చాల వరకు మాస్క్ లు వాడడం మర్చిపోయారు.ఇదే అదనుగా కరోనా మహమ్మారి మళ్ళీ ముంబై లో విజృంభణ కొనసాగిస్తుందని,రోజుకి మహారాష్ట్ర లో 4 ,000 కేసు లు నమోదు అవుతున్నాయి.ఇదే పరిస్థితి కొనసాగితే లాక్ డౌన్ మళ్ళీ విధించవలసి వస్తుందని ముంబై నగర మేయర్ కిషోరీ పాండేకర్ హెచ్చరించారు.ముంబై లో రోజు రోజు కి కరోనా కేసు లు పెరగడం వల్ల మంగళవారం అధికారులతో చర్చలు జరిపి, అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఈ మహమ్మారి తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
రైళ్ల లోను,బస్సులలోను ప్రయాణిస్తున్న వారిలో చాల మంది మాస్క్ లు ధరించడం లేదు.మనం మళ్ళీ మరోసారి లొక్డౌన్ కి వెళ్లకూడదనుకుంటే ప్రజలు అన్ని రకాల కోవిద్ నిబంధనలు పాటించి, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.మళ్ళీ ముంబై లో లాక్ డౌన్ పెట్టడమా? లేదా అన్నది ప్రజల చేతులలోనే ఉంది అని మేయర్ నొక్కి వక్కాణించారు.లాక్ డౌన్ వల్ల ఎంత మంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో మరొకసారి గుర్తు చేసారు. దేశవ్యాప్తం గా ప్రతిరోజూ 10,000 పాజిటివ్ కేసు లు నమోదు అవుతుంటే దానిలో సగానికి సగం కేసులు కేవలం మహారాష్ట్ర నుండే నమోదు అవుతున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.