జాతీయం (National) వార్తలు (News)

ఎం.జె. అక్బర్ వేసిన పరువు నష్టం కేసులో జర్నలిస్టు ప్రియా రమానీని నిర్దోషిగా ప్రకటిస్తూ దిల్లీ హైకోర్టు తీర్పు

MeToo ఉద్యమంలో భాగం గా 2018 అక్టోబర్ లో 20 మంది మహిళా పాత్రికేయులు అక్బర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు.ఏషియన్ ఏజ్ తో పాటు ఇతర పత్రికల్లో సంపాదకుడిగా పని చేసే సమయం లో తమను ఆయన వేధించారని ఆరోపించారు.వీరిలో మొదటగా ఆయన పేరు ప్రస్తావించిన సీనియర్ జర్నలిస్ట్ ప్రియా రామాని.ఒక పత్రికలో 2017 వ సంవత్సరంలో పతాక శీర్షికలో రాసిన కథనాన్ని మరల 2018 అక్టోబర్ 8 న రీట్వీట్ చేస్తూ ఎం జేఅనే వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు.ఆయన న్యూస్ రూమ్ కి బయట,లోపల కూడా ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని,తొలిసారిగా 1993 లో ఒక ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఒబెరాయ్ హోటల్ కి వెళ్ళినప్పుడు అక్బర్ తనను వేధించారని రామాని పేర్కొన్నారు.అయితే అసలు ఆ హోటల్ లో రామానిని కలవని లేదని అక్బర్ చెప్పారు.ఈ ఆరోపణలను ఎం జే అక్టోబర్ 2018 అక్టోబర్ 17 న కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసారు.తనపై వచ్చిన ఆరోపణలపై వ్యక్తిగతంగా పోరాడాలని నిర్ణయించుకున్న ఆయన రామాని పై పరువునష్టం కేసు వేశారు.
ఆ కేసు విషయమై ప్రియా రమానీని కోర్ట్ నిర్దోషిగా ప్రకటించింది.ఆ సందర్భం గా మహిళలు తాము లైంగిక వేధింపులకు గురైనప్పుడు దశాబ్దాల తరువాతయినా సరే బయట పెట్టె హక్కు ఉంది,లైంగిక వేధింపుల వల్ల మహిళా ఆత్మగౌరవం దెబ్బతింటున్నప్పుడు దానిని పణంగా పెట్టి “పరువు ప్రతిష్ట”లను కాపాడడం కుదరదు అని కోర్ట్ వ్యాఖ్యానించింది.
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.