బెంగళూరు నగరాన్ని మరోసారి కరోనా వెన్నాడుతోంది. వైరస్‌ లేదని ఆదమరిస్తే అంతు చూసే పరిస్థితులు ముంచుకొచ్చాయి. ఈ భయంతోనే ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధారణ, శానిటైజర్‌ వినియోగం, భౌతిక దూరం పాటించకపోతే ఇక్కట్లలో పడినట్లేనని అధికారులు హెచ్చరించారు

నగర పరిధిలో గతవారం వరకు నిత్యం కరోనా కేసులు 50 నుంచి 70 మధ్య ఉండేవి. సోమవారం ఒక్కసారిగా ఈ సంఖ్య 286కి పెరిగింది.