క్రైమ్ (Crime) వార్తలు (News)

కుమారుడి చెంపదెబ్బతో ప్రాణం విడిచిన తల్లి

వయోవృద్దులైన తల్లిదండ్రులను ఎంత సున్నితంగా చూసుకోవాలో తెలిపే సంఘటన ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. కుమారుడు కొట్టిన ఒక్క చెంపదెబ్బకు ఓ తల్లి కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఏమి జరిగిందంటే… దిల్లీలోని ద్వారక ప్రాంతంలో నివాసముండే అవ్‌తార్‌ కౌర్‌ (76)కు పక్కింట్లో ఉండేవారితో పార్కింగ్‌ స్థలంపై సోమవారం మధ్యాహ్నం చిన్న వివాదం చెలరేగింది. దీంతో ఆ పక్కింటి వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వారితో గొడవ విషయమై అవ్‌తార్‌ కౌర్‌కు, ఆమె కుమారుడు రణ్‌బీర్‌ (45), కోడలికి మధ్య ఇంటి బయట కొద్ది సేపు చర్చ సాగింది.

ఈ విషయంలోనే కోపోద్రిక్తుడైన రణ్‌బీర్‌ తన తల్లిని చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు కుప్పకూలిపోవడంతో కోడలు ఆమెను లేపేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి రణ్‌బీర్‌ను అరెస్టు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.