గుంటూరు జిల్లా తెనాలిలో నర్సింగ్‌ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థినులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అలాగే మున్సిపాలిటీలో పని చేసే ఉద్యోగులు, అధికారులు కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కేసుల పెరుగుదలతో అధికార యంత్రాంగం అప్రమత్తమై నర్సింగ్‌ కళాశాలలో ఎక్కువ మంది కరోనా బారిన పడటంతో కళాశాలలోని విద్యార్థులందరికీ కొవిడ్‌ పరీక్షలు చేయించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.గుంటూరు జిల్లాలో కూడా గత మూడు రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం గమనార్హం. తొలుత తాడేపల్లి మండలంలో కరోనా కేసులు పెరిగాయి. ఇప్పుడు తెనాలిలో కొవిడ్‌ సోకుతున్న వారి సంఖ్య పెరుగుతుండంతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు.