చెన్నై ఎన్నూరులో శివగామినగర్‌కు చెందిన విక్రమ్ (30) ను లంచాల కోసం అధికారులు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇతనికి ఏడాదిక్రితం వివాహమైంది. భార్య సూర్య. 2019లో రూ.60 లక్షలతో మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని విక్రమ్‌ ప్రారంభించడానికి పలువురి వద్ద రుణాలు తీసుకున్నాడు. ఇతన్ని రెవెన్యూ అధికారులు, విద్యుత్‌ బోర్డు, ఆరోగ్యశాఖాధికారులు తరచూ లంచాలు కోరడం, స్థానిక రాజకీయ నాయకులు మామూళ్ల పేరిట వేధించడంతో మనస్తాపానికి గురైన ఇతను సోమవారం ఎన్నూరు తాళంగుప్పం ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

గత 12న అధికారులు, రాజకీయనాయకులు లంచాలు కోరుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు అతని సోదరుడు విఘ్నేశ్వరన్‌ పోలీసు అధికారులకు ఈమెయిల్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో విక్రమ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల
ప్రాధమిక విచారణలో తేలింది.