తెలంగాణలో విద్యార్థులు కరోనా బారిన పడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమై స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్ సోమేష్‌కుమార్, విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించి 1-8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు (ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి స్కూళ్లు కొనసాగుతున్నాయి) 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పరీక్షపై కేసీఆర్ త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో గతంలో కూడా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని, కరోనాపై ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి సూచనలు వస్తున్నాయని చెప్పారు. విద్యాసంస్థల్లో కరోనా వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.