జాతీయం (National) వార్తలు (News)

కరోనా పై చర్చించిన ప్రధాని మోదీ

ఇవాళ జరిగిన మంత్రుల సమావేశంలో ప్రధాని కరోనా కట్టడి గురించి చర్చించారు.
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని , అన్ని రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. టెస్టింగ్‌ , ట్రేసింగ్‌ను పెంచాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.

కరోనా నియంత్రణపై ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు . ఈ సమావేశానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ, చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భాగేల్ గైర్హాజరయ్యారు. ఇది అందరూ అత్యంత క్రియాశీలకంగా ఉండాల్సిన సమయం అని అన్నారు. అవసరమైతే ‘మైక్రో కంటెయిన్మెంట్’ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, మరికొన్ని చర్యలు తీసుకుందామని, అంతేగానీ ప్రజలకు భయభ్రాంతులకు గురిఅయ్యే వాతావరణాన్ని సృష్టించవద్దని సూచించారు. కరోనా కట్టడి చర్యలతో పాటు, వ్యాక్సినేషన్‌ వేగం మరింత పెంచాలని సీఎంలను కోరారు ప్రధాని మోదీ. దీనికి కావలసిన సహకారాన్ని కేంద్రం అందిస్తుందని హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మూడున్నర కోట్ల కరోనా వాక్సిన్ డోసులను అందించారు. వ్యాక్సిన్‌ వేస్టేజ్‌ను ఆపాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. ఏపీ,తెలంగాణ , ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో 10 శాతం వ్యాక్సిన్‌ వృధా అవుతోందని , అధికార యంత్రాంగం దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు మోదీ.

ఐతే ఈ సమావేశానికి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. మమత ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్లే ప్రధానితో సమావేశానికి హాజరుకాలేకపోయారని ఆమె సన్నిహితులు అంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.