దేశంలో చాలా రాష్ట్రాల్లో విద్యార్థులకు కూడా కరోనా సోకుతుండడంతో పరిస్థితి అదుపు తప్పిందన్న విషయం అర్ధమవుతుంది. ఇండియాలో రెండు వారాల క్రితమే సెకండ్ వేవ్ మొదలవడంతో ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై చర్చించడానికే ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యాహ్నం 12.30కి ఏర్పాటు చేసారు. కరోనా కట్టడి చేయడానికి ఆ రాష్ట్రాలు ఏమేమి చర్యలు చేపట్టాయో, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుని ముందుకు వెళ్లాలో చర్చించి దానిపై నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రాల ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్లు, కంటైన్‌మెంట్ జోన్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక సహా 6 రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 20 రాష్ట్రాల్లో కరోనా కేసులుఎక్కువగా నమోదవుతున్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు స్కూళ్లలో కరోనా బాగా పాకుతోంది. హైదరాబాద్ నాగోల్‌లో ఏకంగా 36 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కామారెడ్డిలోని కస్తూరిబా స్కూల్లో 32 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. కరీంనగర్, మంచిర్యాలలో మొన్న 50 మంది దాకా విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు. ప్రధానంగా కొత్త రకం స్ట్రెయిన్లు (కరోనా నుంచి పుట్టిన రూపాంతర వైరస్‌లు) వేగంగా వ్యాపిస్తున్నాయి.

మరోవైపు కరోనా నియంత్రణకు ఇచ్చే కోవిషీల్డ్ ఇంజెక్షన్‌ను విదేశాల్లో వారికి ఇస్తే రక్తం గడ్డకడుతోందన్న వార్తలపై కేంద్రం స్పందించింది. ఇండియాలో ఆ వ్యాక్సిన్ పంపిణీని ఆపేది లేదని తెలిపింది. ఇండియాలో ఎవరికీ అలా జరగలేదని వివరించైనా తర్వాత కూడా ప్రజల్లో ఈ వ్యాక్సిన్‌పై భయాలున్నాయి. ఇప్పుడు చాలా మంది భారత్ బయోటెక్ చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సినే కావాలని అడుగుతున్నారు. ప్రజల్లో భయాలు పోయేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.

ఇండియాలో కొత్తగా 24,492 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831కి చేరింది. కొత్తగా 131 మంది కరోనాతో చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,58,856కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 20,191 మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత మొత్తం రికవరీల సంఖ్య 1,10,27,543కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.6 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,23,432 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇండియాలో కొత్తగా 8,73,350 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 22,82,80,763కి చేరింది.

తెలంగాణలో కొత్తగా 60,263 చెయ్యగా 204 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. కొత్తగా ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య 1656కి చేరింది. కొత్తగా 170 మంది కోలుకుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 2,97,851కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,015 ఉంటే వీరిలో 624 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. GHMC పరిధిలో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం టెస్టుల సంఖ్య 92,99,245కి చేరింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 23,417 టెస్టులు చేస్తే అందులో 261 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,92,269కి పెరిగింది. కొత్తగా ఎవరూ మరణించలేదుకనుక మరణాల సంఖ్యా స్థిరంగా ఉంది అంటే ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 7185గా ఉంది. కొత్తగా 125 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,83,505కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1579 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,45,80,783 టెస్టులు చేశారు.

ప్రపంచ దేశాల్లో కొత్తగా 4,35,801 పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 12.12 కోట్లు దాటింది. కొత్తగా 9,481 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య కూడా 26.81 లక్షలు దాటేసింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 2.07 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు.

అమెరికాలో కొత్తగా 50,305 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3.01 కోట్లు దాటింది. కొత్తగా 1076 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 5.49 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్ ఉన్నాయి. రోజువారీ మళ్లీ బ్రెజిల్ (84,124) టాప్‌కి వెళ్లగా తర్వాతి స్థానాల్లో అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, టర్కీ, ఇటలీ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త మరణాల్లో బ్రెజిల్ (2798) టాప్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో అమెరికా (1076), ఇటలీ (502), రష్యా (443), పోలాండ్ (372) దేశాలు ఉన్నాయి.