బుధవారంనాడు బెంగళూరు నుంచి జైపూర్ వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించిన ఓ గర్భిణి విమానంలోనే ఒక డాక్టర్, విమాన సిబ్బంది సహాయంతో పాపకు జన్మనిచ్చారు.
ఆ తరువాత జైపూర్ విమానాశ్రయానికి సమాచారం అందించడంతో విమానం అక్కడికి చేరేసరికి తల్లీబిడ్డలకు పూర్తి వైద్య సహాయం అందించేందుకు వీలుగా అంబులెన్స్, డాక్టర్‌ని సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది.