టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏటీఎం లో రేషన్‌: చండీగఢ్ ప్రయోగం!!

దేశంలో తొలిసారిగా హర్యానా ప్రభుత్వం రేషన్‌ ఏటీఎంను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ పైలట్‌ ప్రాజక్ట్‌ను గరుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రారంభించిన అనంతరం రేషన్‌ ఏటీఎం ఐదు నుంచి ఏడు నిమిషాల లోపు 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదల చేస్తుందని, ఈ మెషిన్‌ టచ్‌స్క్రీన్‌ ద్వారా పని చేస్తుందని మీడియా కు తెలిపారు.

ఈ ఏటీఎం మెషీన్‌లో బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉంటుందని, దీని ద్వారా బయోమెట్రిక్‌ ధ్రువీకరణ జరగగానే, లబ్ధిదారునికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్‌గా సంచుల్లో నింపేస్తుందని ఆయన అన్నారు. ఇది ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ ధాన్యం పంపిణీ యంత్రంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫరూకనగర్‌లో విజయవంతంగా నిర్వహించినట్టయితే యూఎన్‌ ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద వీటిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •