టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

తెలంగాణ పాఠశాల టీచర్ల భర్తీ : విద్యాశాఖ!!

టీచర్ పోస్టుల భర్తీ విషయంలో విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులనే భర్తీ చేయాలని, విద్యార్థులు లేని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకూడదని నిర్ణయిస్తూ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తే, ప్రస్తుతమున్న ఖాళీల్లో సుమారు 2 వేల టీచర్‌ పోస్టులు భర్తీకి నోచుకునే అవకాశం లేదు. ఈ క్రమంలోనే విద్యార్థులు లేని స్కూళ్లలోని ఖాళీ పోస్టులను, విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను వేర్వేరుగా గుర్తించి ప్రతిపాదనలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

దాని ప్రకారం విద్యార్థుల్లేని పాఠశాలల్లో 2వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గమనించారు. ఇవన్నీ ఎక్కువగా ప్రైమరీ స్థాయిలోనే ఉన్నట్టు,సాధారణంగా ఒక్కో టీచరుకు ప్రాథమిక పాఠశాల స్థాయిలో 20 మంది, హైస్కూలు స్థాయిలో 50 మంది విద్యార్థులుండాలి. అలా లేకుంటే వాటిని మూసేసి సమీప స్కూళ్లకు అనుసంధానిస్తారు. అలాగే జీరో అడ్మిషన్ల స్కూళ్ల సంఖ్యా పెరుగుతోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    67
    Shares
  • 67
  •  
  •  
  •  
  •