టెక్నాలజీ (Technology) వార్తలు (News)

వచ్చే నెలలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న ప్రభుత్వం!!

జాబ్‌ క్యాలెండర్‌లో గ్రూప్‌-1, గ్రూప్‌-2 సహా పలు విభాగాల్లో అదనంగా పోస్టులు జత చేసి వచ్చే నెలలో నోటిఫికేషన్‌ ఇస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను గుర్తించామని, వీటిలో గ్రూప్‌ 1, 2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నట్టు, ఖాళీగా ఉన్న పోస్టులు వివరాలు రావాల్సి ఉందని, ఇవన్నీ వచ్చాక ఎన్ని పోస్టులు వస్తే అన్ని పెంచి ఆగస్టులో గ్రూప్సు సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.

అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారని, ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించాలని ప్రభుత్వానికి నోట్‌ పంపామని అనుమతి రాగానే వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసకుంటామని వెల్లడించారు. ఇకపై 3-4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని, త్వరగా పోస్టులు భర్తీ చేసేందుకే ప్రిలిమ్స్‌ రద్దు చేయాలని నిర్ణయించినట్టు, ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •