టెక్నాలజీ (Technology) వార్తలు (News)

భారత్‌లో 20 లక్షల ఖాతాల బ్లాక్ చేసిన వాట్సాప్ !!

భారత్‌లో వాట్సాప్ 20 లక్షలకు పైగా అకౌంట్లను బ్లాక్ చేసింది. మే 15 నుంచి జూన్ 15 వరకు భారత్‌లో అధిక మొత్తంలో అసాధారణ సందేశాలను పంపించిన ఖాతాలన్నీ బ్లాక్ చేసినట్టుగా, ఇందులో 95 శాతం అకౌంట్లు, పార్వార్డ్ సందేశాల విషయంలో భారత్‌లో నిర్దేశించిన పరిమితిని ఉల్లంఘించినట్లుగా వెల్లడించింది. ఈ సందర్భంగా భారత్‌లో హానికర, అవాంఛిత సందేశాలను ఎవరూ పంపకుండా నిలువరించడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించిన‌ట్లు స్పష్టం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 80 లక్షల ఖాతాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నెలనెలా వాట్సాప్ తొలగించనున్నట్టు సమాచారం!
వాట్సాప్ ఎప్పుడూ తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి అంశాలతో భారత్‌లో చర్చల్లో నిలుస్తుండగా ఈ నకిలీ వార్తలు గంటల్లోనే వేలాది మందికి చేరి వాటిని అడ్డుకోవడం కష్టంగా మారిపోయింది. పెద్దమొత్తంలో వ్యాప్తి చెందే ఈ తప్పుడు సందేశాలు, వీడియోలు భారత్‌లో గతంలో హింసకు కారణమయ్యాయి. మరణాలకు కూడా దారితీశాయి. వినియోగదారుల ఖాతాల కార్యకలాపాలు, అందుబాటులో ఉన్న సమాచారం, ప్రొఫైల్స్, గ్రూప్ ఫొటోలు, వివరణల ఆధారంగా నేరస్థులను గుర్తిస్తున్నట్లు వెల్లడించింది.

ఫిబ్రవరిలో విడుదలైన ఈ నూతన ఐటీ నిబంధనలు మే నుంచి అమల్లోకి రావడంతో అప్పటి నుంచి సామాజిక మాధ్యమాలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌పై నియంత్రణ, వినియోగదారుల గోప్యత వంటి అంశాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. దీనిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ సాంకేతికత దుర్వినియోగం, తప్పుడు సమాచార వ్యాప్తిని నివారించడానికే నూతన నిబంధనలను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •