టెక్నాలజీ (Technology) వార్తలు (News)

సీటు ఎక్కడొచ్చినా.. కావాల్సినచోటులో క్లాస్ లు??

కాలేజీ ఎంపిక ప్రక్రియలో స్టూడెంట్లు ప్రధానంగా అక్కడ చెప్పే క్లాసులు, ఫ్యాకల్టీ బాగుందని తాము సెలక్ట్ చేసుకున్న కాలేజీకే వెళ్లాలని ఆశపడుతుంటారు. అయితే ఇకపై
ఈ పద్ధతికి స్తస్వి చెప్పనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది.

ఇందుకోసం క్లస్టర్ విధానాన్ని తీసుకురానున్నట్లు, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసేపనిలో అధికారులు నిమగ్నమై ఈ క్లస్టర్లలో కనీసం 6 కాలేజీలు ఉంచాలని అధికారులు సమాలోచనలు చెప్పారు.

రెండు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కాలేజీలను లిస్టు చేయాలని అధికారులు ఆలోచన చేస్తూ పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి త్వరలో రాష్ట్రమంతా అమలు చేయాలనేది అధికారుల ప్లాన్.

ముందుగా హైదరాబాద్ లో కాలేజీలు క్లస్టర్ గా ఏర్పాటు చేసి డిగ్రీ కాలేజీలతో పాటు హైదరాబాద్ ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సహా ఇతర యూనివర్సిటీలు జాతీయ, అంతర్జాతీ సంస్థలను క్లస్టర్ విధానంలో చేర్చాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •