అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు

కరోనా వైరస్‌ ఆనవాళ్లను కనిపెట్టడం కోసం వినియోగిస్తున్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న వేళ విడ్‌- 19 యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్‌లను ఎగుమతులను ఆంక్షల కేటగిరీలో ఉంచుతున్నామని, తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆంక్షల కేటగిరీలో ఉంచిన వస్తువులను ఎగుమతి చేయాలంటే ఎగుమతిదారులు డీజీఎఫ్‌టీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ కిట్‌ల లభ్యతను పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •