అంతర్జాతీయం (International) వార్తలు (News)

కాబుల్‌లో భారత ఎంబసీ మూసివేత??

తాలిబన్ల అధీనంలోకి వచ్చిన అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు గందరగోళంగా మారడంతో ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు భారత్‌ ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. కాబుల్ లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను తక్షణమే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తీసుకొస్తున్నారు.

120 మందికి పైగా అధికారులు, సిబ్బందితో వాయుసేన సి-17 విమానం కాబుల్‌ నుంచి బయల్దేరింది. ఎంబసీకి చెందిన కీలక పత్రాలను కూడా భద్రంగా తీసుకొస్తున్నట్లు, ఆదివారం రాత్రి భారత వాయుసేనకు చెందిన భారీ విమానం ఒకటి ఇరాన్‌ గగనతలం నుంచి అఫ్గానిస్థాన్‌కు వెళ్లి మన దేశానికి చెందిన కొందరిని తీసుకొచ్చినట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. మరోవైపు అఫ్గాన్‌లో చిక్కుకున్న భారత పౌరులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరందరినీ సురక్షితమైన ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ నడుమ ఉంచినట్లు, ఒకటి, రెండు రోజుల్లో వీరందరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •