అంతర్జాతీయం (International) వార్తలు (News)

తాలిబన్లకు సంబందించిన కంటెంట్‌ పై నిషేధం విధించిన ఫేస్‌బుక్‌!!

సోషల్‌ మీడియా తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంటూ వారికి సంబంధించిన కంటెంట్‌ను తమ సంస్థల వేదికలపై నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తాలిబన్లు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌లను పంపే వాట్సాప్‌ను కంపెనీ నిషేధం విధించినా నిరంతరాయంగా వాడుతున్నారు.

అయితే తాజాగా ఫేస్‌బుక్‌ ప్రతినిధి మాట్లాడుతూ అఫ్గాన్‌లో పరిస్థితిని తమ సంస్థ నిశితంగా గమనిస్తోందని, నిషేధిత సంస్థలకు సంబంధించిన ఏదైనా వాట్సాప్‌ ఖాతాపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ట్విటర్‌ను కూడా తాలిబన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. ఇటీవల అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకొన్న విషయాన్ని తాలిబన్‌ ప్రతినిధి ట్విట్టర్ ద్వారానే తెలిపారు. దీనిపైఒక ఆంగ్ల వార్త సంస్థ ట్విటర్‌ను ప్రశ్నించగా తాము హింసను ప్రోత్సహించే సంస్థలను, విద్వేషాన్ని రెచ్చగొట్టే సంస్థలను వినియోగించడానికి అంగీకరించమని పేర్కొంది. అయితే వీటిని ఏ విధంగా గుర్తిస్తారో మాత్రం వెల్లడించలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పౌరహక్కులు హరించడం, మహిళలను అణచివేయడం వంటివి చేస్తారని పేర్కొనగా మరోపక్క తాలిబన్‌ ప్రతినిధులు మాత్రం తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •