జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

జియోఫోన్ నెక్స్ట్ .. సెప్టెంబర్ 10 నుండి మార్కెట్లోకి!!

రిలయన్స్ 44 వ AGMs మీటింగ్ నుండి ప్రకటించిన ఈ ఫోన్ పైన సేల్ గురించి ఎట్టకేలకు జియో నోరువిప్పి JioPhone Next ఫోన్ సెప్టెంబర్ 10 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. నిజానికి రిలయన్స్ జియో తన 5G స్మార్ట్ ఫోన్ ను ప్రకటిస్తుందని అభిమానులు ఊహించినప్పటికీ 4G ఫోన్ ను మాత్రమే జియో ప్రకటించింది. కానీ, ఈ ఫోన్ గురించి వస్తున్న ఆన్లైన్ లీక్స్ మరియి అంచనా ధర వివరాలను చూస్తుంటే ఈ ఫోన్ అత్యంత చవకయిన 4G స్మార్ట్ ఫోనుగామార్కెట్లోకి రానుందని అంచనాలు పెరిగిపోయాయి.

దీనికి తోడు, JioPhone Next ఫోన్ ను అందించడానికి ప్రపంచ టెక్ దిగ్గజం Google కూడా చేయికలపడంతో ఈ ఫోన్ పెద్ద చర్చనీయాంశమైంది.

మరి మీరు కూడా ఈ ఫోన్ గురించిన వివరాలు చూసెయ్యండి..

JioPhone Next: ధర తదితర వివరాలు

ఈ జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ అత్యంత చవకధరకే లభించనున్న స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుందని, ప్రస్తుతం మర్కెట్లో ఉన్న తక్కువ ధరకే లభిస్తున్న 4G స్మార్ట్ కంటే కూడా ఈ ఫోన్ రేట్ మరింత తక్కువగా ఉండాలి. అందుకే, ఈ ఫోన్ రూ.3,500 నుండి రూ. 4,500 రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా!

ఇక ఫీచర్ల గురించి తెలుసుకోవాలంటే జియోఫోన్ నెక్స్ట్ అనేది గూగుల్ క్లౌడ్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఫుల్లీ ఫీచర్డ్ స్మార్ట్ఫోన్. ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్-లౌడ్ ఆఫ్-స్క్రీన్ టెక్స్ట్ వంటి చాలా ఫీచర్లు చేర్చబడినట్టు సమాచారం. దీనితో పాటు, భాషా అనువాదం(లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్) వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించింది. జియోఫోన్ నెక్స్ట్ 13 MP స్మార్ట్ కెమెరాతో ప్రారంభించబడుతుందని కూడా ఊహిస్తున్నారు. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్తో కూడా వస్తుంది.

ఈ కొత్త సరసమైన 4 జి స్మార్ట్ఫోన్ సహాయంతో ఇంకా 2G నెట్వర్క్ కే పరిమితపరిమితమైన 300 మిలియన్ల వినియోగదారులను 4జి నెట్వర్క్కు తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు, నెక్స్ట్ లెవల్ చందాదారుల వృద్ధి కోసం రిలయన్స్ ఎంట్రీ లెవల్ వినియోగదారుల వైపు మొగ్గు చూపుతోందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •