క్రైమ్ (Crime) వార్తలు (News)

బోధన్‌ లో మూడు రోజులుగా పరీక్ష పత్రాల లీక్‌!!

తెలంగాణ వర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని, నిఘా కరువైందని, రోనా నిబంధల పేరుతో పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన కనీస నిబంధన చర్యలను పట్టించుకోకపోవడంతో ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరీక్షా కేంద్రాల వారికి అనుకూలంగా మారిందనే పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోటీపరీక్షల్లో అమలుచేసే నిమిషం ఆలస్యం నిబంధన సాధారణ పరీక్షల్లో అమలు చేయకపోవడం కొందరు విద్యార్థులకు అనుకూలంగా మారి అరగంట ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించాల్సి రావడంతో ఈ నిబంధనను అనుకూలంగా తీసుకుని పరీక్షా కేంద్రాల్లోని పలువురు అబ్జర్వర్లు విద్యార్థులకు మాల్‌ప్రాక్టీస్‌ను పోత్రహిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు పరీక్షా కేంద్రాలకు ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం పంపిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రానికి పంపించే ప్రశ్నాప్రతాలపై ప్రత్యేకమైన కోడ్‌ వేస్తారు. నిర్వాహకులు డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష సమయానికి 5 నిమిషాలు ముందుగా సబ్జెక్టుల వారీగా విద్యార్థుల గదులకు చేరవేస్తారు. అబ్జర్వర్స్‌ ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మా ర్చుకుంటున్నారు. కొందరు తమ వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్ల ద్వారా ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి బయటకు చేరవేయగా విద్యార్థులు వాటి జవాబులను మైక్రో జిరాక్స్‌ తీసుకుని ఎగ్జామ్‌ హాల్‌కు వచ్చి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారు.

బోధన్‌లో 5 పరీక్షా కేంద్రాలుండగా, ఒకటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, 4 ప్రైవేట్‌లో ఉన్నాయి. 3 రోజుల నుంచి పేపర్‌ లీకేజీ జరుగుతున్నట్లు, శనివారం నాలుగో సెమిస్టర్‌ డాటాబేస్‌ మేనేజ్‌ మెంట్‌ ప్రశ్నపత్రం బయటకు లీక్‌ చేయడంతో ఒక జిరాక్స్‌ సెంటర్‌ వద్ద విద్యార్థులు గుంపులుగా చేరి లీకేజైన ప్రశ్నల జవాబులు మైక్రో జిరాక్స్‌లు తీసుకుని పరీక్ష రాసినట్లు నిఘావర్గాల సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    21
    Shares
  • 21
  •  
  •  
  •  
  •