అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆఫ్గాన్ లో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం??

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ప్రజల్లో అశాంతి నెలకొంది. వేరే దేశం నుంచి వచ్చి ఆఫ్గానిస్థాన్లో ఉన్నవారు ప్రాణాలతో అక్కడనుంచి వారి స్వదేశాలకు వెళ్లిపోవాలని, ఆఫ్గాన్ దేశస్తులు కూడా అవకాశం ఉన్నంత వరకూ దేశాన్ని విడిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఆఫ్గాన్ లో నాయకుల పాలన పోయిన ఉగ్రపాలనకు ఏర్పాట్లు జరుగుతుండటంతో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారి, ఉపాధి కరవవుతుందని, ఉద్యోగాలు పోతాయని అసలు ప్రాణాలే పోతాయని ఆఫ్ఘన్ ప్రజలు భయపడుతూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో ఉన్న తమ సొమ్ములపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యాంకులు, ఏటీఎంలలో ఉన్న తమ డబ్బును డ్రా చేసుకోవడానికి ఎగబడుతున్నారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు తమకు దక్కదేమోనని భయపడుతున్నారు. డబ్బులుడ్రా చేసుకోవాటానికి భారీగా ఏటీఎంలు, బ్యాంకులకు పరుగులుపెడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •