వార్తలు (News)

కోవిడ్ ప్రోటోకాల్స్‌ తో పాఠశాలలు తెరిచాం : వై ఎస్ జగన్ ??

ఏపీలో స్కూళ్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో రెండో విడత కింద మనబడి నాడు-నేడు పాఠశాలలను ప్రారంభించినట్టుగా ఏ పి ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తూ.గో. జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం హైస్కూల్‌ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.

స్కూళ్లు తెరవాలని నిపుణులు చెబుతున్నారని, అందుకే రాష్ట్రంలో బడులు ప్రారంభించామని సీఎం జగన్ తెలిపారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలు రాసి రెండు సంవత్సరాలు అయిందని, కోవిడ్ ప్రోటోకాల్స్‌తో పాఠశాలలు ప్రారంభించామని సీఎం జగన్ స్పష్టం చేశారు. అన్ని నిర్ణయాలు పేదల కోసమేనని చెప్పిన సీఎం విద్యార్థుల భవిష్యత్ కోసం మేనమామలాగా పనిచేస్తున్నామన్నారు. విద్యార్థుల విషయంలో ఎక్కడా రాజీపడటంలేదని అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •