అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

తాలిబన్ల చెర నుండి తప్పించుకోవాలని… ఇద్దరి మృతి!!

ఆఫ్గానిస్తాన్‌ దేశం తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిపోవడంతో ప్రజలు తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎప్పుడు ఎలాంటి విపత్తుని ఎదుర్కోవలసి వస్తుందో అని భయంతో బ్రతుకుతున్నారు. దీంతో దేశం నుండి పారిపోయేందుకు ప్రజలు విమానాశ్రయాలకు పెద్ద ఎత్తున చేరుకుంటుండడంతో ఆ ప్రాంతమంతా ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయి. విమానాలు కూడా అధిక సంఖ్యలో లేకపోవడంతో ఆ ప్రాంతమంతా ప్రజలతో కిక్కిరిసి పోతున్నాయి. విమానాలు కూడా అధిక సంఖ్యలో లేకపోవడంతో తరువాత సర్వీసు కోసం అక్కడే పడిగాపులు కాస్తున్నారు.

కాబూల్‌ విమానాశ్రయంలో జన సందోహం అధికంగా ఉండటంతో భద్రతా దళాలు కాల్పులు జరపగా ఐదుగురు మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. ఆఫ్గాన్‌ నుండి పారిపోవాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు విమానంలో ఖాళీ లేక మరో అవకాశం లేక విమానం చక్రాలకు తమను తాము కట్టుకోగా కాబూల్‌ నుండి విమానం ఒక్కసారిగా గగనంలోకి ఎగిరిన వెంటనే వీరిద్దరూ ఒక్కసారిగా నేలపై పడిపోవడం వీడియోలో కన్పిస్తుంది. త్రెహన్‌ టైమ్స్‌ షేర్‌ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు చక్రాల నుండి పడిపోవడం కనిపిస్తుంది. అయితే వీరిద్దరూ చనిపోయినట్లు తెలుస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •