జాతీయం (National) వార్తలు (News)

సరికొత్త గరిష్టాలకు చేరుకున్న నేటి మార్కెట్లు!!

మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నుండి ఊగిసలాటలో కొనసాగిన మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకుని ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా దిద్దుబాటుకు గురైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 55,386-55,854 మధ్య కదలాడి చివరకు సెన్సెక్స్‌ 209 పాయింట్ల లాభంతో 55,792 వద్ద ముగియగా, నిఫ్టీ 16,495-16,628 మధ్య కదలాడి చివరికి 51 పాయింట్లు ఎగబాకి 16,614 వద్ద ముగిశాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, టైటన్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా,హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఆటో, పవర్‌ గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ షేర్లు లాభాల్లో ముగియగా.. ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    58
    Shares
  • 58
  •  
  •  
  •  
  •