టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

విశాఖ స్టీల్ అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడి??

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో కార్మికులు ఆందోళనకు దిగి ఉక్కు పరిశ్రమ పరిపాలనా భవనాన్ని (అడ్మిన్‌ బిల్డింగ్‌) ముట్టడించారు. ఒకపక్క వర్షం వస్తున్నా కూడా గొడుగులతో కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర విభజనతో చాలా అన్యాయం జరిగిందని, ఉన్న ఒకే ఒక్క భారీ పరిశ్రమను తీసుకెళ్లేందుకు యత్నిస్తే సహించేది లేదని, విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సొంత గనులు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎన్నో పోరాటాల ద్వారానే విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చిందని, దీన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు. కార్మిక సంఘాల ఆందోళనతో పరిపాలనా భవనం కూడలి ప్రాంతంలో ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం కలిగింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •